Kishan Reddy: ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణలో రైళ్లు బాగా అందుబాటులోకి వచ్చింది మోదీ వచ్చాకనే: కిషన్ రెడ్డి
- మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో 48 కొత్త రైళ్లు వచ్చాయి
- 2014-15 రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.258 కోట్లు కేటాయించాం
- ఈ రోజున ఆ కేటాయింపులు రూ.2601 కోట్లకు చేరాయి
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణ ప్రాంతంలోని ప్రజలకు రైళ్లు అందుబాటులోకి వచ్చింది కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాకనే అని అన్నారు. హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో 48 కొత్త రైళ్లను ప్రారంభించారని చెప్పారు. 2014-15 రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.258 కోట్లు కేటాయించారని, ఈ రోజున ఆ కేటాయింపులు రూ.2601 కోట్లకు చేరాయంటే తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం ఏవిధంగా పాటుపడుతుందో స్పష్టమౌతోందని అన్నారు. మోదీ హయాంలో తెలంగాణకు కొత్త రైళ్లు, రైల్వే మార్గాలు వచ్చాయని గుర్తుచేశారు.