America's Got Talent: అమెరికా డ్యాన్స్ టాలెంట్ షో 'ఏజీటీ'లో విజేతగా నిలిచిన 'ముంబై డ్యాన్స్​ గ్రూప్​'!

Mumbai dance group V Unbeatable wins Americas Got Talent

  • కల నెరవేర్చుకున్న ముంబై డ్యాన్సర్లు
  • గత ఏడాది నాలుగో ప్లేస్.. ఈసారి విన్నర్లు
  • టీమ్ కు స్ఫూర్తినిచ్చిన బాలీవుడ్ హీరోలు రణ్ వీర్ సింగ్, అక్షయ్ కుమార్

అమెరికాలోని ప్రఖ్యాత ‘అమెరికాస్ గాట్ టాలెంట్: ది చాంపియన్స్ షో’ (ఏజీటీ) రెండో సీజన్ లో ముంబైకి చెందిన ‘వి అన్ బీటబుల్’ డ్యాన్స్ గ్రూప్ విన్నర్ గా నిలిచింది. ఈ డ్యాన్స్ గ్రూప్ లో వెళ్లిన 29 మందిలో చాలా వరకు ముంబైలోని స్లమ్స్ కు చెందిన పేదవాళ్లేనని పోటీ నిర్వాహకులు వెల్లడించారు. ‘వి అన్ బీటబుల్’ డ్యాన్స్ గ్రూప్ అద్వితీయమైన ప్రదర్శన ఇచ్చిందని ప్రశంసించారు.

ఎన్నో ఆటంకాలను అధిగమించి..

ముంబైకి చెందిన ఈ డ్యాన్స్ గ్రూప్ మొదట్లో ఇండియాలో వివిధ సంస్థలు నిర్వహించిన చాలా డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. డ్యాన్స్ ప్లస్ 4, ఇండియా బనేగా మంచ్ వంటి పోటీల్లో గెలిచింది. అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో కూడా గత ఏడాది ఈ గ్రూప్ పాల్గొని.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి ఏకంగా విన్నర్ గా నిలిచింది.

ప్రేరణ ఇచ్చిన బాలీవుడ్ స్టార్లు

అమెరికా షోలో ‘వి అన్ బీటబుల్’ టీమ్ ఫైనల్స్ కు చేరినప్పుడే బాలీవుడ్ సెలబ్రిటీలు బెస్టాఫ్ లక్ చెప్పారు. టీమ్ విన్నర్ గా నిలవాలని ఆకాంక్షిస్తూ హీరోలు రణ్ వీర్ సింగ్, అక్షయ్ కుమార్ ట్వీట్లు చేశారు.

America's Got Talent
mumbai
Mumbai Dance Group
V Unbeatable
Mumbai Team
  • Error fetching data: Network response was not ok

More Telugu News