SGST: ఏపీలో జీఎస్టీ చట్టం ప్రకారం మొట్టమొదటి అరెస్టు
- విశాఖలోని శేఖర్ ట్రేడర్స్, వెంకటసాయి ట్రేడర్స్ యజమాని శేఖర్
- ఆన్ లైన్ వే బిల్లుల దుర్వినియోగం
- రూ.2.6 కోట్ల పన్ను ఎగవేత
ఏపీలో ఎస్ జీఎస్టీ చట్ట ప్రకారం మొట్టమొదటి అరెస్టు జరిగింది. విశాఖపట్టణంలోని శేఖర్ ట్రేడర్స్, వెంకటసాయి ట్రేడర్స్ యజమాని దుడ్డు శేఖర్ ని అరెస్టు చేశారు. నిందితుడిని జిల్లా సెషన్స్ జడ్జి ముందు జీఎస్టీ అధికారులు ప్రవేశపెట్టారు. శేఖర్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన అనంతరం కేంద్ర కారాగారానికి తరలించారు.
పాత ఇనుము వ్యాపారం పేరుతో గాజువాకలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న శేఖర్, ఆన్ లైన్ వే బిల్లులను దుర్వినియోగం చేయడం ద్వారా రూ.2.6 కోట్ల పన్ను ఎగవేశాడు. మరికొందరు వ్యాపారులు రూ.10 కోట్ల వరకు పన్ను ఎగవేసి ఉండొచ్చని అధికారుల అంచనా.