Nishanth Shetty: కంబళ పోటీల్లో మరో సంచలనం... శ్రీనివాస గౌడ రికార్డును బద్దలు కొట్టిన నిశాంత్ శెట్టి

Nishanth Shetty breaks Srinivasa Gowda record in Kambala

  • 9.55 సెకన్లలో 100 మీటర్లు పరుగుతీసిన గౌడ
  • ఇప్పుడా రికార్డును తిరగరాసిన నిశాంత్ శెట్టి
  • 9.51 సెకన్లలోనే 100 మీటర్లు దౌడు తీసిన నిశాంత్ శెట్టి

కర్ణాటకలో నిర్వహించే సంప్రదాయ కంబళ పోటీల్లో శ్రీనివాస గౌడ అనే యువకుడు 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తితే అదో అద్భుతంగా భావించాం! ఉసేన్ బోల్ట్ 9.58 సెకన్ల వరల్డ్ రికార్డతో పోల్చుకుని అచ్చెరువొందాం. కానీ, ఆ ఘనత గురించి అందరూ మాట్లాడుకుంటున్న తరుణంలోనే దాన్ని మించిన మరో అద్భుతం నమోదైంది.

కంబళ టోర్నీలో భాగంగా తాజాగా జరిగిన పోరులో శ్రీనివాస గౌడ రికార్డు బద్దలైంది. నిశాంత్ శెట్టి అనే యువకుడు చిరుతను తలపించేలా పరుగులు తీస్తూ 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలోనే అధిగమించి ఔరా అనిపించాడు. నిశాంత్ శెట్టి కర్ణాటకలోని బజగోళి జోగిబెట్ట ప్రాంతానికి చెందినవాడు. ఈ పోటీల్లో నిశాంత్ శెట్టి మొత్తం 143 మీటర్ల దూరాన్ని 13.68 సెకన్లలో పూర్తి చేశాడు.

Nishanth Shetty
Srinavasa Gowda
Kambala
Karnataka
Record
  • Loading...

More Telugu News