Daggubati Purandeswari: రివర్స్​ టెండరింగ్​ తో 'పోలవరం' పనులు కుంటుపడ్డాయి: పురందేశ్వరి విమర్శలు

 Purandeswari criticises polavaram works slow down

  • రాష్ట్రంలో ప్రస్తుతం కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి శూన్యం
  • ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు
  • రాజధాని రైతులకు ఎలా న్యాయం ఎలా చేస్తారు?

వైసీపీ, టీడీపీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి శూన్యమని అన్నారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయని, ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని, ఆర్థికలోటులో పథకాలు ఎలా అమలు చేస్తారో వాళ్లే చెప్పలేకపోతున్నారంటూ వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు.

మూడు రాజధానుల అంశంతో పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయని, రాజధాని రైతులకు న్యాయం ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శాసనమండలి గురించి ప్రస్తావిస్తూ దాని వల్ల ఉపయోగం లేదని అంటున్నారని, అలాంటప్పుడు కేబినెట్ తొలి భేటీలోనే దానిని రద్దు చేయాలని కోరుతూ తీర్మానం ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News