Hindi: ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో హిందీకి మూడో స్థానం

Hindi at third place in world languages

  • ప్రపంచవ్యాప్తంగా 615 మిలియన్ల మంది హిందీ మాట్లాడతారని గుర్తింపు
  • అగ్రస్థానంలో ఇంగ్లీషు
  • రెండో స్థానంలో చైనా భాష మాండరిన్

భారతదేశ జాతీయ అధికార భాష హిందీ. హిందీ ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ప్రచార సభల పుణ్యమాని కొన్ని దశాబ్దాల నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోనూ హిందీ క్రమంగా విస్తరిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే, హిందీ ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉంది. వరల్డ్ లాంగ్వేజ్ డేటాబేస్ ఎథ్నోలాగ్ వెలువరించిన తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషను 615 మిలియన్ల మంది మాట్లాడతారని గుర్తించారు.

ఈ జాబితాలో ఇంగ్లీషు అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లం మాట్లాడేవారి సంఖ్య 1,132 మిలియన్ల మంది కాగా, 1,117 మిలియన్లతో చైనా భాష మాండరిన్ రెండో స్థానంలో ఉంది. మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ భాష బంగ్లా 228 మిలియన్లతో ఏడో స్థానం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్న 7,111 భాషలను పరిగణనలోకి తీసుకుని ఈ తాజా సంచికను విడుదల చేశారు.

Hindi
English
Mandarin
Language
  • Loading...

More Telugu News