Varla Ramaiah: చంద్రబాబు, లోకేశ్ భద్రత విషయంలో రాజకీయం చేయాలనుకోవడం చాలా తప్పు: వర్ల రామయ్య

Varla Ramaiah questions AP Government over security issue of Chandrababu and Lokesh

  • చంద్రబాబు, లోకేశ్ ల భద్రత కుదింపు
  • ఇది ప్రభుత్వ కుట్ర అంటూ వర్ల రామయ్య ఆరోపణలు
  • పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ల భద్రత తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు. చంద్రబాబు, లోకేశ్ ల భద్రత తగ్గించడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగివుందని ఆరోపించారు. వీరిద్దరికీ తీవ్రవాదుల నుంచి పెనుముప్పు ఉన్న విషయం ప్రభుత్వానికి తెలియదా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ లకు భద్రత కల్పించే విషయంలో రాజకీయం చేయాలనుకోవడం చాలా తప్పు అని హితవు పలికారు. వారిద్దరికీ పూర్తిస్థాయి భద్రత కల్పించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Varla Ramaiah
Chandrababu
Nara Lokesh
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News