Jagan: కంటి వెలుగు కార్యక్రమంలో చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు

CM Jagan  satires on Chandrababu Naidu

  • కర్నూలులో వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం
  • హాజరైన సీఎం జగన్
  • తమది ప్రజల ప్రభుత్వం అంటూ పునరుద్ఘాటన
  • చంద్రబాబుపైనా సెటైర్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్ కర్నూలులో మూడో విడత కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది ప్రజల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. తాము చేస్తున్న సంక్షేమం చూసి కొందరు అసూయపడుతున్నారంటూ, దేనికైనా మందు ఉంటుందేమో కానీ అసూయమంటలకు మందు ఉండదని విపక్ష నేత చంద్రబాబుపైనా సెటైర్లు వేశారు..  ఏ మంటకైనా చికిత్స ఉంటుందేమో కానీ కడుపుమంటకు చికిత్స లేదని, కంటికి సమస్యలు వస్తే నయం చేయవచ్చని, కానీ చెడుదృష్టిని నయం చేయలేమని అన్నారు. వయసు మళ్లితే ఫర్వాలేదని, మెదడు కుళ్లితే కష్టమని వ్యంగ్యం ప్రదర్శించారు.

Jagan
YSR KantiVelugu
Kurnool District
Chandrababu
  • Loading...

More Telugu News