Hyderabad: ఫొటో స్టూడియోలో బాలికపై యువకుడి అసభ్య ప్రవర్తన.. చితక్కొట్టిన స్థానికులు!

man molested girl in hyderabad

  • సైనిక్‌పురిలో ఘటన
  • ఫొటో తీయించుకునేందుకు వెళ్లిన బాలికపై అత్యాచారయత్నం
  • నేరేడ్‌మెట్‌  పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని స్థానికులు చితక్కొట్టారు. దీంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. ఫొటో తీయించుకునేందుకు ఈ రోజు ఉదయం ఓ బాలిక ఆర్‌ఎస్‌ డిజిటల్‌ ఫొటో స్టూడియోకు వెళ్లింది. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్ సలీం బాలికను ఫొటో తీస్తానని చెప్పి, అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఫొటో స్టూడియోలో భయపడిపోయిన బాలిక కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. దీంతో స్థానికులు సలీంను పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌లో ఆ యువకుడిపై బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News