Chandrababu: చంద్రబాబు కుటుంబానికి ప్రాణహాని ఉందనే ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి: కళా వెంకట్రావు

Life threat is there for Chandrababu family says Kala Venkata Rao

  • చంద్రబాబు భద్రతా సిబ్బందిని 146 నుంచి 67కి తగ్గించారు
  • లోకేశ్ భద్రతను కూడా కుదించారు
  • రాజకీయ కారణాలతోనే ఇలాంటి చర్యలు తీసుకున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడంపై ఆ పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. భద్రతా సిబ్బందిని 146 నుంచి 67కి తగ్గించారని విమర్శించారు. తీవ్రవాదుల బెదిరింపులు ఎదుర్కొంటున్న నారా లోకేశ్ కు కూడా భద్రతను తగ్గించారని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే భద్రతను కుదించారని చెప్పారు. చంద్రబాబు కుటుంబానికి ప్రాణహాని ఉందనే ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని తెలిపారు. వారికి గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

Chandrababu
Nara Lokesh
Kala Venkata Rao
Telugudesam
Security
  • Loading...

More Telugu News