CI Venkata Reddy: గుంటూరు జిల్లాలో... వివాహేతర సంబంధం పెట్టుకున్న సీఐపై వేటు
- మహిళను వంచించి అక్రమ సంబంధం పెట్టుకున్న సీఐ వెంకటరెడ్డి
- తనను మోసం చేశాడంటూ అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
- వెంకటరెడ్డి తప్పు చేశాడని విచారణలో తేలిన వైనం
సమాజానికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి... ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ఆమెను మోసం చేసిన పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా నగరంపాలెం సీఐగా వెంకటరెడ్డి పని చేస్తున్నారు. అయితే, ఓ మహిళను వంచించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో వెంకటరెడ్డి తనను మోసం చేశారంటూ సదరు మహిళ అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఐజీ వరకు వెళ్లింది. దీంతో వెంకటరెడ్డిపై విచారణకు ఐజీ ఆదేశించారు. వెంకటరెడ్డి తప్పు చేసినట్టు విచారణలో తేలింది. దీంతో, ఆయనను సస్పెండ్ చేశారు.