Hyderabad: ఐదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Nampally court sentence 20 years in jail for raping child

  • రెండేళ్ల క్రితం ఐదేళ్ల బాలికపై అత్యాచారం
  • దోషిగా తేలిన 26 ఏళ్ల యువకుడు
  • జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలల అదనపు శిక్ష

ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన 26 ఏళ్ల యువకుడికి నాంపల్లి మెట్రోపాలిటిన్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 4 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండ నయాఖిలాకు చెందిన అజ్మత్‌ఖాన్ (26) వెల్డర్. 29 జులై 2018న ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

తాజాగా, ఈ కేసులో నిందితుడు అజ్మత్‌ఖాన్ దోషిగా తేలడంతో కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 4 వేల జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలలు అదనంగా శిక్ష విధించాలని నాంపల్లి మెట్రోపాలిటిన్ న్యాయమూర్తి కె.సునీత ఆదేశించారు.

Hyderabad
girl
court
Rape case
  • Loading...

More Telugu News