B. Gopal: 33 సినిమాల్లో 25 హిట్లు కొట్టాను: దర్శకుడు బి.గోపాల్

Prathidhavni Movie

  • దర్శకుడు టి.కృష్ణ నాకు స్ఫూర్తి
  • అసిస్టెంట్ డైరెకర్ ను అయితే చాలనుకున్నాను 
  • నా తొలి చిత్రం 'ప్రతిధ్వని'  

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథలతో ప్రేక్షకులను అలరించిన అగ్రదర్శకులలో బి. గోపాల్ ఒకరు. బాలకృష్ణతో ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రాలు భారీ విజయాలను సాధించి ఆయనకి మరింత పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. దర్శకుడిగా టి. కృష్ణగారు నాకు స్ఫూర్తి. ఆయన గురించి విన్న తరువాతనే నా దృష్టి అటువైపు మళ్లింది.

అసిస్టెంట్ డైరెక్టర్ ను కావాలనే ఉద్దేశంతో చెన్నై కి వెళ్లాను. దర్శకుడిగా నా తొలి చిత్రం 'ప్రతిధ్వని' .. రామానాయుడుగారు నిర్మాత. తొలి అవకాశమే అగ్రస్థాయి నటీనటులతో చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆ సినిమా తరువాత నేను వెనుదిరిగి చూసుకోలేదు. ఇంతవరకూ 33 సినిమాలు చేశాను .. వాటిలో 25 హిట్లు వున్నాయి. సీనియర్ స్టార్ హీరోలతోనూ .. ఈ తరం స్టార్ హీరోలతోనూ సినిమాలు చేయడం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది" అని చెప్పుకొచ్చారు.

B. Gopal
Prathidhvani Movie
Tollywood
  • Loading...

More Telugu News