Pakistan: బాంబు ప్రూఫ్ ఇంట్లో జైషే చీఫ్ మసూద్ అజర్.. కీలక సమాచారం సేకరించిన ఇంటెలిజెన్స్

Terrorist Masood Azhar living bomb proof house in pakistan

  • పాకిస్థాన్‌లోని బహవల్పూరులో దాక్కున్న మసూద్ అజర్
  • భారత్-పాక్ మధ్య చిగురిస్తున్న మైత్రిని దెబ్బతీసేందుకే ఉగ్రదాడులు
  • జైషే బాధ్యతలను చూసుకుంటున్న మసూద్ సోదరుడు

గతేడాది పుల్వామా దాడి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ సేకరించింది. పాకిస్థాన్‌, బహవల్పూర్‌‌లో బాంబులు కూడా నాశనం చేయలేని ఓ ఇంట్లో దాక్కున్నాడని నిఘావర్గాలు గుర్తించాయి. అలాగే, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడిచేసిన తర్వాత దొరికిన మొబైల్ నంబర్లలో ఒకటి బహవల్పూర్‌లోని ఉగ్రవాద కేంద్రంతో అనుసంధానమైనట్టు ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో తేలింది.

2008 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన మసూద్ భారత్‌కు మోస్ట్ వాంటెడ్. ప్రస్తుతం అతడు వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడని, జైషే బాధ్యతలను అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్ అల్వీ చూసుకుంటున్నట్టు గతంలో భారత విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పేర్కొన్నారు. కాగా, మోదీ ప్రధాని అయ్యాక భారత్-పాకిస్థాన్ మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడుతుండడంతో దానిని విచ్ఛిన్నం చేసేందుకే ఉగ్రవాదులు పఠాన్ కోట్, పుల్వామా దాడులకు తెగబడినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News