GST: జీఎస్టీ వసూలులో టాప్-4కు దూసుకెళ్లిన తెలంగాణ!

GST Collections Increase in Telangana

  • జనవరిలో 19 శాతం పెరిగిన వసూళ్లు
  • తొలి స్థానంలో చండీగఢ్
  • ఇప్పటివరకూ రూ. 24,135 కోట్ల వసూలు
  • వసూలు టార్గెట్ లో 84 శాతం సాధించనున్న తెలంగాణ

వస్తు సేవల పన్ను వసూళ్లలో తెలంగాణ సత్తా చాటింది. గత సంవత్సరం జనవరితో పోలిస్తే, ఈ సంవత్సరం జీఎస్టీ వసూళ్లు 19 శాతం పెరిగాయి. 2019 జనవరిలో రూ. 3,195 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ సంవత్సరం అది రూ. 3,787 కోట్లకు పెరిగింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, చండీగఢ్ రాష్ట్రంలో అత్యధికంగా 22 శాతం మేరకు జీఎస్టీ వసూళ్లు పెరుగగా, ఆ తరువాత గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. ఐదో స్థానంలో కేరళ 17 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల కాలంలో రూ. 24,135.30 కోట్ల వస్తు సేవల పన్ను ఆదాయం వసూలైంది. మొత్తం మీద 2019-20లో రూ. 34,232.93 కోట్ల జీఎస్టీ ఆదాయం ఉంటుందని తొలుత అంచనా వేయగా, ఇప్పటికే 77.3 శాతం రాబడి వచ్చింది. మరో రెండు నెలలు మిగిలివుండగా, కనీసం రూ. 6 వేల కోట్ల వరకూ వసూలయ్యే అవకాశాలు ఉన్నాయని మొత్తం మీద టార్గెట్ లో 84 శాతం వసూళ్లను తెలంగాణ సాధించనుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది.

GST
Telangana
India
Tax
  • Loading...

More Telugu News