Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నామమాత్రం!

Normal Rush in Tirumala

  • 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • నిన్న స్వామిని దర్శించుకున్న 76,017 మంది భక్తులు
  • హుండీ ఆదాయం రూ. 2.85 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి కేవలం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, వీరికి రెండు గంటల్లోనే స్వామి దర్శనం లభించనుంది. టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు కూడా అంతే సమయంలో దర్శనం పూర్తవుతోంది. నిన్న స్వామివారిని 76,017 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 2.85 కోట్లు లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, స్వామి దర్శనం త్వరగా పూర్తవుతూ ఉండటంతో తిరుమలలో నివాసం ఉంటున్న వారు, వ్యాపారులు దర్శనానికి వెళుతున్నారు.

  • Loading...

More Telugu News