Friendship: హీరోగా ఎంట్రీ ఇస్తున్న టీమిండియా బౌలర్ హర్భజన్‌సింగ్.. కీలక పాత్రలో అర్జున్

Team India crickter Harbhajan singh turns actor

  • ‘ఫ్రెండ్‌షిప్’ సినిమాలో నటిస్తున్న భజ్జీ
  • హీరోయిన్‌గా తమిళ బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా మరియసేన్
  • పలు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు

తన స్పిన్ మాయాజాలంతో భారత జట్టుకు అనేక విజయాలు అందించిన టీమిండియా స్పిన్నర్ హర్భజన్‌సింగ్ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు రెడీ అయ్యాడు. నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. భజ్జీ హీరోగా తమిళంలో ‘ఫ్రెండ్‌షిప్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. తమిళ బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా మరియసేన్ హీరోయిన్. ప్రముఖ నటుడు అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. జాన్‌పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  సీన్‌టో స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జేపీఆర్, స్టాలిన్ నిర్మిస్తున్నారు. పలు భారతీయ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Friendship
crickter
Harbhajan singh
Actor Arjun
Kollywood
  • Loading...

More Telugu News