Kaira Adwani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Kaira Adwani to do web series again

  • మరోసారి వెబ్ సీరీస్ లో కైరా 
  • చరణ్ చేతిలో మరో సినిమా హక్కులు 
  • ధనుష్ 'లోకల్ బాయ్' రెడీ  

 *  హిందీ సినిమాలతో బిజీగా వున్న బాలీవుడ్ నటి కైరా అద్వానీ ఇటీవల 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సీరీస్ లో నటించింది. తాజాగా మరోసారి 'గిల్టీ' పేరిట రూపొందే వెబ్ సీరీస్ లో కూడా నటించడానికి ఓకే చెప్పింది.
*  ఆమధ్య మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' హిట్ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను హీరో రామ్ చరణ్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని తండ్రి చిరంజీవితో రీమేక్ చేయనున్నాడు. ఇదిలావుంచితే, తాజాగా మలయాళంలో హిట్టయిన 'డ్రైవింగ్ లైసెన్స్' చిత్రం రీమేక్ హక్కులను కూడా చరణ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిని ఓ యంగ్ హీరోతో రీమేక్ చేస్తాడట.
*  తమిళ హీరో ధనుష్ కథానాయకుడుగా సంక్రాంతికి వచ్చిన 'పటాస్' చిత్రాన్ని తెలుగులోకి 'లోకల్ బాయ్' పేరిట అనువదిస్తున్నారు. తమిళనాడు ప్రాచీన మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో మెహ్రీన్, స్నేహ కథానాయికలుగా నటించారు. అనువాద కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ఈ నెల 28న విడుదల చేస్తున్నారు.

Kaira Adwani
Ramcharan
Chiranjeevi
Dhanush
Mehrin
  • Loading...

More Telugu News