Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా సమక్షంలో టీడీపీలో చేరిన బీజేపీ కార్యకర్తలు

In the presence of ex minister Ganta BJP activists joined TDP

  • ఇది శుభపరిణామం
  •  ‘స్థానిక‘ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత చేరికలతో బలం
  •  భవిష్యత్తులో అన్ని పార్టీల నుంచి టీడీపీలోకి వస్తారు

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ సమక్షంలో 300 మంది బీజేపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ పని అయిపోయిందని అనుకుంటున్న సమయంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు తమ పార్టీలో చేరడం శుభపరిణామంగా అభివర్ణించారు.

భవిష్యత్తులో అన్ని పార్టీల నుంచి టీడీపీలోకి చేరికలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత చేరికలు రాబోయే  స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత బలాన్ని చేకూర్చాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ నెల 19 నుంచి వార్డుల వారీగా 45 రోజుల పాటు ప్రజా చైతన్యయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు.

Ganta Srinivasa Rao
Telugudesam
BJP
activists
Vizag
  • Loading...

More Telugu News