Ch Malla Reddy: మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ హెచ్చార్సీని ఆశ్రయించిన మహిళ

Woman moves to HRC and complains on minister Mallareddy

  • భూ వివాదంలో మల్లారెడ్డి
  • తన భూమిని కబ్జా చేసేందుకు మంత్రి యత్నిస్తున్నారంటూ మహిళ ఫిర్యాదు
  • అధికారులు కూడా మంత్రికే మద్దతు ఇస్తున్నారని ఆరోపణ

ఓ భూ వివాదంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై పి.శ్యామలాదేవి అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేడ్చెల్ జిల్లా సూరారంలో తనకు చెందిన 33 కుంటల భూమిని మంత్రి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డికి సూరారంలో రెండు ఆసుపత్రులు ఉన్నాయని, ఆ ఆసుపత్రుల మధ్యలో తన స్థలం ఉండడంతో కబ్జా ప్రయత్నాలు చేస్తున్నారని, అధికారులు సైతం మంత్రికే వత్తాసు పలుకుతున్నారని శ్యామలా దేవి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె హెచ్చార్సీకి విజ్ఞప్తి చేశారు.

Ch Malla Reddy
Minister
Land
Woman
HRC
  • Loading...

More Telugu News