Nirbhaya: మార్చి 3న తప్పకుండా దోషులను ఉరి తీస్తారని భావిస్తున్నా.. నిర్భయ తల్లి

Nirbhaya mother Aasha devi reactions about patila house court verdict

  • మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది
  • కోర్టు తీర్పు సంతృప్తి కలిగించింది
  • ఈసారి శిక్ష అమలు చేయడం వాయిదా పడదనుకుంటున్నా

నిర్భయ దోషులు నలుగురిని మార్చి 3వ తేదీన ఒకేసారి ఉరి తీయాలంటూ తాజాగా పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం తనను పలకరించిన మీడియాతో నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ, మొదటి నుంచి తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, కోర్టు తీర్పు సంతృప్తి కలిగించిందని అన్నారు.

నిర్భయ దోషులకు చాలా అవకాశాలిచ్చారని, ఈసారి శిక్ష అమలు చేయడం వాయిదా పడదని అనుకుంటున్నానని అన్నారు. ఖరారు చేసిన తేదీ నాడే ఆ నలుగురిని తప్పకుండా ఉరి తీస్తారని భావిస్తున్నానని, దోషులకు శిక్ష పడిన తర్వాతే దేశానికి తన సందేశం వినిపిస్తానని చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News