Budda Venkanna: విజయసాయిరెడ్డి గారూ, అవినీతి సామ్రాజ్యం తాళాలు మీకు అప్పగించి జగన్ అడ్డంగా దొరికిపోయారు: బుద్ధా వెంకన్న

Budda Venkanna comments on Vijaysai Reddy

  • వైసీపీ, టీడీపీ నేతల మధ్య కొనసాగుతున్న విమర్శల దాడులు
  • విజయసాయిరెడ్డిపై బుద్ధా వ్యంగ్యం
  • జైలు అనుభవాలతో పుస్తకం రాయాలని సూచన

ఏపీలో ఐటీ దాడుల పర్యవసానంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. "వ్యవస్థలను బ్రష్టుపట్టించి, చట్టాలను అపహాస్యం చేసి, మాయ లెక్కలతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన జగన్ తాళాలు మీకు అప్పగించి అడ్డంగా దొరికిపోయారు. జైలు గురించి, జైలుకు వెళ్లడం గురించి మీరు మాట్లాడడం కాదు, మీ అనుభవాలతో పుస్తకాలు రాయండి విజయసాయిరెడ్డి గారూ! ఆ పుస్తకానికి 'ఇంత బతుకు బతికి జైల్లో...' అనే పేరుపెట్టండి!" అంటూ ఎద్దేవా చేశారు.

Budda Venkanna
Vijay Sai Reddy
Jagan
IT Raids
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News