Adireddy Bhavani: నా ప్రస్థానానికి తోడ్పడతారని ఆశిస్తూ ‘ట్విట్టర్’లో రంగప్రవేశం చేస్తున్నాను: టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని

Tdp Leader Adireddy Bhavani says I have opened twitter account

  • ఆంధ్ర ప్రజలకు, తెలుగువారికి వందనాలు
  • చంద్రబాబు గారి బంటుగా నా శాయశక్తులా కృషి చేస్తా
  • శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేతలు

టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి భవాని ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె పోస్ట్ చేశారు. ‘ఆంధ్రప్రజలకు, తెలుగువారికి వందనాలు. రాజమండ్రి, ఆంధ్ర ప్రజల వాణిగా, ఆదిరెడ్డి, కింజరాపు వారసురాలిగా, తెలుగు దేశం కార్యకర్తగా, చంద్రబాబు గారి బంటుగా నా శాయశక్తులా కృషి చేస్తాను. మీరందరూ నా ప్రస్థానానికి తోడ్పడతారని ఆశిస్తూ ట్విట్టర్ రంగప్రవేశం చేస్తున్నాను’ అంటూ తన పోస్ట్ లో ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మహిళా నాయకురాలు అనిత తదితరులు స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. 

Adireddy Bhavani
Telugudesam
Twitter
account
Ram mohan naidu
  • Error fetching data: Network response was not ok

More Telugu News