Stock Market: వీడని కరోనా భయం.... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- అంతర్జాతీయంగా కరోనా ఆందోళన
- లోహ, ఇంధన షేర్ల ధరల పతనం
- అనిశ్చితితో ఆరంభమైన సెన్సెక్స్, నిఫ్టీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ హడలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. దానికితోడు లోహ, ఇంధన షేర్లు నష్టాలు చవిచూడడంతో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా కుదుపులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే మార్కెట్లలో అనిశ్చితి కనిపించింది. ముగింపు వరకు అదే ట్రెండ్ కొనసాగడంతో మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. క్లోజింగ్ బెల్ మోగే సమయానికి సెన్సెక్స్ 202 పాయింట్ల నష్టంతో 41,055 వద్ద నిలిచిపోగా, నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో 12,045 వద్ద ముగిసింది. నెస్లే, టైటాన్, కోటక్ మహీంద్రా, వేదాంత షేర్లు లాభాలు ఆర్జించగా, ఓఎన్జీసీ, సిప్లా, యెస్ బ్యాంక్, కోల్ ఇండియా, గెయిల్ సంస్థల షేర్లకు నష్టాలు తప్పలేదు.