Uttam Kumar Reddy: గతంలో ఎన్టీఆర్ ఏ కమిషన్ వేయకుండానే గిరిజనులకు రిజర్వేషన్లు పెంచారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy responds on ST Reseravtions

  • అప్పట్లో 5 నుంచి 6 శాతానికి పెంచారని వెల్లడి
  • జనాభా ఆధారంగా 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్
  • గిరిజనులను, ముస్లింలను కేసీఆర్ మోసం చేశారని వ్యాఖ్యలు

తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఎలాంటి కమిషన్ వేయకుండానే గిరిజనులకు రిజర్వేషన్లు 5 నుంచి 6 శాతానికి పెంచారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గిరిజనులు, ముస్లింలను కేసీఆర్ మోసం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. గతంలో 'దళితుడే సీఎం' అని చెప్పిన కేసీఆర్ తన క్యాబినెట్ లో ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. ముస్లింల రిజర్వేషన్ల అంశాన్ని టీఆర్ఎస్ పార్లమెంటులో ఒక్కరోజు కూడా మాట్లాడలేదని ఉత్తమ్ ఆరోపించారు.

Uttam Kumar Reddy
NTR
ST Reservations
KCR
Telangana
Congress
TRS
  • Loading...

More Telugu News