Vijay Devarakonda: పూరి ఈ సారి ఎక్కువ సమయమే తీసుకుంటాడట

Puri Cinema

  • వేగంగా సినిమాలు పూర్తిచేసే పూరి
  • పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం 
  • తాజా చిత్రం కోసం పూరి కొత్త నిర్ణయం 

మొదటి నుంచి కూడా పూరి జగన్నాథ్ తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో తనదైన దూకుడు చూపిస్తూనే వచ్చాడు. కథను సిద్ధం చేసుకోవడం .. సంభాషణలు రాసుకోవడం .. సెట్స్ పైకి వెళ్లడం .. చకచకా షూటింగును పూర్తి చేయడం .. సినిమాను విడుదల చేయడం.. ఇలా ఆయన చాలా వేగంగా తన పనులను చక్కబెడుతుంటాడు. ఆయనలోని ఈ స్పీడ్ కారణంగానే కొన్ని సినిమాలు దెబ్బతిన్నాయనే విమర్శ కూడా వుంది.

అలాంటి పూరి ఈ సారి తన తాజా చిత్రానికి 100 రోజులకి పైగా సమయాన్ని తీసుకోనున్నాడని అంటున్నారు. విజయ్ దేవరకొండతో ఆయన చేస్తున్న సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. విజయ్ దేవరకొండ సినిమానుంచి అభిమానులు ఆశించే అన్నిరకాల అంశాలు ఉండేలా చూసుకుంటూనే, పాన్ ఇండియా స్థాయిలో క్వాలిటీ కంటెంట్ ను అందించడానికి ఆయన తనవంతు కృషి చేస్తున్నాడని చెబుతున్నారు.

Vijay Devarakonda
Aananya Pandey
Puri Cinema
  • Loading...

More Telugu News