rss: విడాకులపై ఆరెస్సెస్‌ చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడ్డ హీరోయిన్‌

rss chief mohan bhagavath comments on educated person

  • చదువుకున్న, సంపన్న కుటుంబాల వారే విడాకులు తీసుకుంటున్నారు
  • చదువు, డబ్బు ఉంటే అహంకారం వస్తుందని మోహన్ భగవత్ వ్యాఖ్యలు
  • ఈ మనిషి అసలు ఇలా ఎలా మాట్లాడతారు? అని  సోనమ్ ప్రశ్న

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రస్తుత కాలంలో చదువుకున్న, సంపన్న కుటుంబాలకు చెందినవారే ఎక్కువ శాతం విడాకులు తీసుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. చదువు, డబ్చు కలిగి ఉంటే అహంకారం వస్తుందని, పర్యవసానంగా కుటుంబాలు ముక్కలైపోతున్నాయని వ్యాఖ్యానించారు. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయని అన్నారు.

దీనిపై బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనం కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ మనిషి అసలు ఇలా ఎలా మాట్లాడతారు? అని ఆమె ప్రశ్నించారు. ఇవి తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే వ్యాఖ్యలని ఆమె మండిపడ్డారు.
 

rss
mohan bhagavath
  • Error fetching data: Network response was not ok

More Telugu News