harish shankar: 'అర్ధరాత్రి శబ్దాలు భరించలేకపోతున్నా' అంటూ హరీశ్ శంకర్ ట్వీట్‌.. స్పందించి వెంటనే వచ్చిన పోలీసులు

police solved harish shankar problem

  • జూబ్లీ ఎన్‌క్లేవ్ రెసిడెన్సీకి సమీపంలో అర్ధరాత్రి భవన నిర్మాణ పనులు 
  • ట్వీట్‌ ద్వారా బాధను వ్యక్తం చేసిన హరీశ్
  • పెట్రోలింగ్‌ సిబ్బందిని పంపిన పోలీసులు
  • భవన నిర్మాణ పనులు నిలిపేలా చేసిన అధికారులు

తాను నివాసం ఉంటోన్న జూబ్లీ ఎన్‌క్లేవ్ రెసిడెన్సీకి సమీపంలో అర్ధరాత్రి సమయంలో భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని, భారీ శబ్దాలు వస్తున్నాయని దర్శకుడు హరీశ్ శంకర్ చేసిన ట్వీట్‌కు పోలీసులు స్పందించారు. ఆయనకు ఫోన్ చేసిన పోలీసులు అడ్రస్‌ను అడిగి తెలుసుకుని పెట్రోలింగ్‌ సిబ్బందిని పంపారు.

భవన నిర్మాణ పనులు నిలిపేలా చేశారు. పోలీసుల స్పందన పట్ల హరీశ్‌ శంకర్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు మరో ట్వీట్ చేశారు. ‘నేను నమ్మలేకపోతున్నాను. కొన్ని నిమిషాల్లోనే ఆ శబ్దాలు ఆగిపోయాయి' అని పేర్కొన్నారు. జూబ్లీ ఎన్‌క్లేవ్‌ రెసీడెన్సీలో నివాసముంటున్న వారందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని, ఎప్పుడైనా రాగలరని నిరూపించారని అన్నారు. తమ సమస్య పట్ల వెంటనే స్పందించి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజలు మరింత బాధ్యతగా మెలిగేలా చేశారని అన్నారు.

harish shankar
Tollywood
Hyderabad
  • Error fetching data: Network response was not ok

More Telugu News