RGV: శంషాబాద్‌ ఏసీపీని కలిసి.. సినిమా కోసం 'దిశ' ఘటన వివరాలు అడిగిన రామ్‌ గోపాల్‌ వర్మ

 Ram Gopal Varma visits RGI Airport PS

  • 'దిశ' సినిమా తీస్తానని ఇటీవలే ప్రకటన
  • పలు వివరాలు తెలుసుకుంటోన్న వర్మ
  • తన పరిశోధన సినిమాకి ఉపయోగపడుతుందన్న దర్శకుడు

హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌ సమీపంలో సంచలనం రేపిన దిశ హత్యాచారం ఘటన ఆధారంగా సినిమా తీస్తానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే ఆయన రేపిస్ట్ చెన్నకేశవులు భార్యను కూడా కలిసి పలు వివరాలు తెలుసుకున్నారు.

ఈ రోజు ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. శంషాబాద్ ఏసీపీని కలిసి దిశ కేసుకు సంబంధించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 'దిశ ఘటన గురించి సమాచారం తెలుసుకోవడానికి శంషాబాద్‌ ఏసీపీని కలిశాను. దిశ సినిమాను తీయడానికి నేను చేస్తోన్న పరిశోధన ఉపయోగపడుతుంది' అని ఓ జాతీయ మీడియాకు తెలిపారు.

RGV
Disha
  • Loading...

More Telugu News