sitara: నిద్రపోయే ముందు తండ్రి మహేశ్‌ బాబుతో కూతురు సితార ముచ్చట్లు.. అబ్బురపరుస్తున్న ఫొటో!

sitara with her father mahesh babu

  • ఫొటో పోస్ట్ చేసిన నమ్రత
  • చెవులకు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని, నవ్వుతూ సితార
  • ఆ విశేషాలను వింటూ మహేశ్ బాబు చిరునవ్వులు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కూతురు సితారకు సంబంధించిన విశేషాలపై నెటిజన్లు బాగా ఆసక్తి కనబర్చుతారు. వారి ఆసక్తికి తగ్గట్లుగానే మహేశ్ భార్య నమ్రత.. తన కూతురికి సంబంధించిన అప్ డేట్లను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా, ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో అభిమానులను అబ్బుర పరుస్తోంది.

నిద్రపోయే ముందు తన తండ్రికి కబుర్లు చెబుతూ, చెవులకు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని, నవ్వుతూ సితార కనపడుతోంది. ఆమె చెబుతోన్న విశేషాలను వింటూ మహేశ్ బాబు కూడా చిరునవ్వులు చిందించాడు. 'చాలా అద్భుతం మేడం' అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. ఇటీవల సితార సరిలేరు నీకెవ్వరు సినిమాలోని 'డ్యాంగ్ డ్యాంగ్' పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ డ్యాన్స్  చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. 

sitara
Mahesh Babu
Tollywood
Instagram
  • Loading...

More Telugu News