Flight Emergency Landing: బ్రేకింగ్... అనంతపురం పొలాల్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Flight Emergency Landing Near Anantapur

  • ఇంజన్ లో సాంకేతిక లోపం
  • చదునుగా ఉన్న పొలాల్లో ల్యాండ్
  • కర్ణాటక కంపెనీకి చెందినదిగా గుర్తింపు

అనంతపురం సమీపంలో ఓ చిన్న విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ఇంజన్ లో లోపం తలెత్తడం, దగ్గర్లో విమానాశ్రయం లేకపోవడంతో, బ్రహ్మసముద్రం మండలం ఎరడికెరాలో విమానం పొలాల్లో దిగింది. ఈ విమానం కర్ణాటకకు చెందిన జిందాల్ కంపెనీకి చెందిన జెట్ విమానంగా గుర్తించారు. విమానం ల్యాండ్ అయిన ప్రాంతం చదునుగా ఉండటంతో, అందులో ఉన్న వారికి స్వల్ప గాయాలు మినహా మరే ప్రమాదమూ జరగలేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, విమానం వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Flight Emergency Landing
Anantapur District
Brahmasamudram
  • Loading...

More Telugu News