Kangana Ranaut: వైమానిక దళ పైలట్‌గా కంగన రనౌత్.. ఫస్ట్‌ లుక్‌ విడుదల.. మామూలుగా లేదు!

Tejas first look transforms into pilot Twitter salutes her look

  • కంగన కొత్త సినిమా టైటిల్ తేజస్
  • విడుదల చేసిన సినీ బృందం 
  • కంగన పాత్రకు సెల్యూట్ చేస్తోన్న నెటిజన్లు

బాలీవుడ్ హీరోయిన్‌ కంగన రనౌత్ తన తదుపరి చిత్రంలో ఓ పవర్ ఫుల్ రోల్‌లో నటిస్తోంది. ఇందుకు సంబంధించి ఆమె ఫస్ట్‌లుక్‌ను ఆ సినిమా బృందంతో పాటు 'కంగన టీమ్' ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా పేరు 'తేజస్' అని ప్రకటించారు.

ఇందులో భారత వైమానిక దళ పైలట్‌గా ఆమె కనపడుతోంది. 'దేశం కోసం ప్రతి రోజు పని చేస్తూ త్యాగాలు చేస్తోన్న సాహసోపేత మహిళా జవాన్ల కోసం..' అంటూ పేర్కొన్నారు. రోనీ స్క్రూవాలా ఆర్ఎస్‌వీపీ మూవీస్ సంస్థ ఈ 'తేజస్‌'ను నిర్మిస్తోంది. ఎయిర్‌ఫోర్స్‌ పైలట్ దుస్తుల్లో ఆమె కనపడుతున్న తీరు మామూలుగా లేదని, ఆమెకు సెల్యూట్ చేస్తున్నామని నెటిజన్లు పేర్కొంటున్నారు.

 పోతే, ప్రస్తుతం కంగన చేతిలో 'తలైవి' వంటి జయలలిత బయోపిక్ ప్రాజెక్టు కూడా ఉంది. ఇందులో కంగన రనౌత్.. జయలలిత పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Kangana Ranaut
IAF
  • Loading...

More Telugu News