Odisha: రియల్ హీరో.. మెరుపు వేగంతో స్పందించి అమ్మాయి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. వీడియో వైరల్

girl  rescued by an RPF constable

  • ఒడిశాలోని భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో ఘటన
  • రైలు కింద పడిపోబోయిన అమ్మాయి
  • రక్షించిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌

రైలు కింద పడిపోబోతోన్న అమ్మాయిని చూసిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఒకరు మెరుపు వేగంతో స్పందించి ఆమె ప్రాణాలు కాపాడిన ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఓ యువతి కదులుతోన్న రైలును ఎక్కడానికి ప్రయత్నించింది.

దీంతో అదుపుతప్పి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న సందులో పడబోయింది. దీంతో  ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను ఫ్లాట్‌ఫాం మీదకు లాగాడు. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కదులుతోన్న రైలును ఎక్కకూడదని రైల్వే అధికారులు సూచనలు చేస్తున్నప్పటికీ ప్రయాణికులు పదే పదే ఇటువంటి ఘటనలకు పాల్పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Odisha
Train Accident
  • Error fetching data: Network response was not ok

More Telugu News