Akkineni Nageswara Rao: మీకు ఇష్టం లేకపోతే చెప్పండి .. ఆ పాత్రకి వేటూరిని పెట్టి హిట్ చేస్తానని అక్కినేనితో అన్నాను: నిర్మాత దొరస్వామిరాజు

Seetharamayya Gari Manavaralu Movie

  • 'సీతారామయ్య గారి మనవరాలు' కథ నాకు బాగా నచ్చింది 
  • కథ విన్న తరువాత అక్కినేని ఆలోచనలో పడ్డారు 
  • కథపై గల నమ్మకంతో అలా అనేశానన్న దొరస్వామిరాజు

దొరస్వామిరాజు నిర్మించిన చెప్పుకోదగిన చిత్రాలలో 'సీతారామయ్యగారి మనవరాలు' ఒకటి. క్రాంతికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగేశ్వరరావు - మీనా ప్రధానమైన పాత్రలను పోషించారు. 1991లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

తాజా ఇంటర్వ్యూలో ఆ సినిమాను గురించి దొరస్వామిరాజు మాట్లాడుతూ .."ఈ సినిమా కథ వినగానే అక్కినేని నాగేశ్వరరావుగారిని కలిశాను. కథ విన్న తరువాత ఆయన ఆలోచనలో పడ్డారు. ఆయన అనుభవం ముందు నాకున్న అనుభవం చాలా తక్కువ. అయినా నాకు కోపం వచ్చేసింది. 'ఏమండీ మీకు ఇష్టమైతే చెప్పండి .. లేకపోతే ఆ పాత్రలో వేటూరి సుందర రామ్మూర్తిని పెట్టి హిట్ చేసి, ఆ తరువాతనే మిమ్మల్ని కలుస్తాను" అని అన్నాను. కథపై నాకుగల నమ్మకంతో అలా అన్నాను. ఆయన కొంతసేపు మౌనంగా వుండిపోయి .. ఆ తరువాత 'సరే కానివ్వండి' అన్నారు. అలా ఆ సినిమా మొదలైంది" అని చెప్పుకొచ్చారు.

Akkineni Nageswara Rao
Meena
Seetharamayagari Manavaralu Movie
  • Loading...

More Telugu News