Peddapalli MLA: కరీంనగర్ కాలువలో కుళ్లిపోయిన మృతదేహాల గుర్తింపు... మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లెలు, బావ, మేనకోడలు!

Dead Bodies Found In Car Identified

  • ఈ ఉదయం బయటపడ్డ కారు
  • 15 రోజుల క్రితం సత్యనారాయణరెడ్డి, రాధ, వినయశ్రీ అదృశ్యం
  • మనోహర్ రెడ్డిని పరామర్శించిన నేతలు

15 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి కాకతీయ కెనాల్‌ లో పడిపోయిన ఓ కారు, ఈ ఉదయం బయటపడగా, అందులో మూడు కుళ్లిపోయిన మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ మృతదేహాలను పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లెలు రాధ, ఆమె భర్త లక్ష్మీపూర్ కు చెందిన సత్యనారాయణరెడ్డి, వాళ్ల కూతురు వినయశ్రీగా గుర్తించారు.

ఈ దంపతులు రెండు వారాల క్రితం తమ కుమార్తె వినయశ్రీతో కలసి బయలుదేరారని, అప్పటి నుంచి అదృశ్యమయ్యారని పోలీసు కేసు కూడా నమోదైంది. అదే రోజున వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. చెల్లెలు, బావ మరణంతో కుంగిపోయిన మనోహర్ రెడ్డిని పలువురు రాజకీయ, పుర ప్రముఖులు ఓదార్చారు.

Peddapalli MLA
Manohar Reddy
Car Accident
Sister
  • Loading...

More Telugu News