Arvind Kejriwal: కేజ్రీవాల్ మెడలో మఫ్లర్ మాయం.. రెడ్ స్వెటర్‌ ధరించి ప్రమాణ స్వీకారం!

Delhi CM Kejriwal wears red sweater in Oath taking ceremony

  • మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్
  • సోషల్ మీడియాలో కేజ్రీ రెడ్ స్వెటర్‌పై చర్చ
  • ఆ స్వెటర్ ఖరీదు రూ. 1600 లేనట!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనగానే మెడలో మఫ్లర్‌తో ఉన్న నిండైన రూపం కళ్లముందు కదలాడుతుంది. మఫ్లర్ లేకుండా ఆయన కనిపించిన సందర్భాలు బహు తక్కువ. అత్యంత సాదాగా కనిపించే కేజ్రీవాల్ వస్త్రధారణ కూడా అంతే సాదాగా ఉంటుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు.

అయితే, ఈసారి ప్రమాణ స్వీకారంలో ఆయన మెడలో మఫ్లర్ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెడ్ స్వెటర్, బ్లాక్ ట్రౌజర్ ధరించిన కేజ్రీవాల్ ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు. కేజ్రీ ధరించిన ఈ స్వెటర్‌ ఇప్పుడు సోషల్ మీడియాకెక్కింది. అది మాంటే కార్లే బ్రాండ్‌కు చెందినదని, దాని ధర రూ. 1600 అని నెటిజన్లు చెబుతున్నారు. కామన్ మ్యాన్‌కు ఆయన సరికొత్త నిర్వచనం అని పొగడ్తలు కురిపిస్తున్నారు.

Arvind Kejriwal
New Delhi
sweater
Muffler
  • Loading...

More Telugu News