Actress Trisha: మైనస్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో నటించి మెప్పించిన త్రిష.. వెల్లువెత్తుతున్న అభినందనలు!

Kollywood Actress Trisha praised by Industry

  • ‘రాంగి’ సినిమాలో నటించిన త్రిష
  • ఉజ్బెకిస్థాన్‌లో ఆఖరి షెడ్యూల్ పూర్తి
  • గడ్డకట్టే చలిలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా నటన

మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ అద్భుతంగా నటించిన  కోలీవుడ్ భామ త్రిషకు చిత్ర పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళంలో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న త్రిష.. శరవణన్ దర్శకత్వంలో ‘రాంగి’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కథ, మాటలు అందించడం గమనార్హం. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ను ఇటీవల ఉజ్బెకిస్థాన్‌లో పూర్తిచేశారు.

 షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీల్లో ఉందట. అయినప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పడని త్రిష.. తెల్లవారుజామునే లేచి షూటింగ్‌కు రెడీ అయిపోయేదట. అంతటి చలిలోనూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆమె నటించడంతో షెడ్యూల్ త్వరగా పూర్తయిందని యూనిట్ పేర్కొంది. మైనస్ డిగ్రీల్లోనూ అద్భుతంగా నటించి షెడ్యూల్‌ సకాలంలో పూర్తయ్యేలా చేసిన త్రిషను యూనిట్ సభ్యులు అభినందించారు. విషయం తెలిసిన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు కూడా త్రిషను అభినందించారట.

Actress Trisha
kollywood
uzbekistan
shooting
  • Loading...

More Telugu News