New Delhi: ఢిల్లీలో పోలీసులు, నేరస్థులకు మధ్య ఎదురుకాల్పులు.. ఇద్దరు కరుడుగట్టిన దుండగుల హతం!

Two criminals dead in Delhi encounter

  • ఢిల్లీలోని ప్రహ్లాద్‌పూర్‌లో నిందితులు ఉన్నట్టు సమాచారం
  • గాలింపు చేపట్టిన పోలీసులు
  • వారిని చూసి కాల్పులకు తెగబడిన నేరస్థులు

ఢిల్లీలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులు హతమయ్యారు. దొంగతనాలు, కిడ్నాప్‌లు, హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్‌లు ఢిల్లీలోని ప్రహ్లాద్‌పూర్‌లో తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ప్రత్యేక బృందం వారిని గాలిస్తూ ఆ ప్రాంతానికి చేరుకుంది. వారిని చూసి అప్రమత్తమైన దుండగులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. హోరాహోరీగా జరిగిన ఈ కాల్పుల్లో నిందితులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. పట్టపగలు ఎదురుకాల్పులు జరుగుతుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

New Delhi
Encounter
criminals
dead
  • Loading...

More Telugu News