Tollywood: టాలీవుడ్ నటుడు శ్రీకాంత్‌కు పితృ వియోగం.. అనారోగ్యంతో మృతి చెందిన పరమేశ్వరరావు

Tollywood Actor Srikanth father dies

  • ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న పరమేశ్వరరావు
  • పరిస్థితి విషమించడంతో గత రాత్రి కన్నుమూత
  • నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు

టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ తండ్రి మేక పరమేశ్వరరావు (70) గత రాత్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలలుగా నగరంలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. నేటి మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

పరమేశ్వరరావుది కృష్ణా జిల్లాలోని మేకావారిపాలెం కాగా, ఆ తర్వాత ఆయన కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలేనికి వలస వెళ్లారు.  పరమేశ్వరరావు-ఝాన్సీలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీకాంత్, అనిల్ కాగా, ఓ అమ్మాయి నిర్మల ఉన్నారు.

Tollywood
Actor Srikanth
Hyderabad
  • Loading...

More Telugu News