Andhra Pradesh: అక్షరాస్యతలో తెలుగమ్మాయిలదే అగ్రస్థానం!

Telugu teenage girls top in literacy

  • అమ్మాయిల అక్షరాస్యతలో ఏపీ, తెలంగాణ, కేరళ, పశ్చిమబెంగాల్ టాప్
  • 600కుపైగా జిల్లాల్లో 74 వేల మంది టీనేజ్ అమ్మాయిలపై సర్వే
  • ఏపీలో 19 ఏళ్లు దాటినా చదువుకుంటున్న అమ్మాయిలు 96.6 శాతం

అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అమ్మాయిలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. మహింద్రా అండ్ మహింద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్‌ సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహించిన సంయుక్త సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశంలోని 600కుపైగా జిల్లాల్లో 74 వేల మంది టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలపై సర్వే నిర్వహించారు. 13-19 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల అక్షరాస్యతలో కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు వంద శాతం అక్షరాస్యతతో అగ్రస్థానంలో నిలిచాయి.

19 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా చదువుకుంటున్న వారి సంఖ్య ఏపీలో 96.6 శాతం కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఇది 88.9 శాతంగా ఉంది. 21 ఏళ్లు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని 86.6 శాతం మంది అమ్మాయిలు భావిస్తుండగా, 71 శాతం మంది ఏపీ అమ్మాయిలు ఉన్నత చదువులు చదవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. 69.4 శాతం మంది టీనేజీ అమ్మాయిలు తాము చదువుకున్న చదువుకు సరిపడా ఉపాధి పొందాలని భావిస్తున్నారు. 81 శాతం మంది ఏపీ బాలికలు ఇంగ్లిష్, కంప్యూటర్ నైపుణ్యాలు నేర్చుకోవాలని అభిలషిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది.

Andhra Pradesh
Telangana
literacy
India
  • Loading...

More Telugu News