Hyderabad: భార్యలేని జీవితం వద్దనుకుని.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త

Husband suicide after wife death in Hyderabad

  • 18 నెలల క్రితం వివాహం
  • కుమార్తెకు జన్మనిచ్చిన నాలుగు రోజులకే భార్య మృతి
  • ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

భార్యలేని జీవితాన్ని ఊహించుకోలేకపోయిన భర్త తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన భీమ్ (27), మంజుల (22) భార్యాభర్తలు. 18  నెలల క్రితం వీరి వివాహం జరగ్గా గతేడాది డిసెంబరు 12న వీరికి కుమార్తె జన్మించింది. అయితే, ఆ తర్వాత నాలుగు రోజులకే అనారోగ్యం కారణంగా మంజుల మృతి చెందింది.

దీంతో చిన్నారి బాగోగులను భీమ్ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మరోవైపు, భార్య మరణంతో తీవ్ర కలతకు గురైన భీమ్.. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. నిత్యం ఆమె ఆలోచనలతోనే గడిపాడు. నిన్న సాయంత్రం తీవ్ర మనస్తాపానికి గురైన భీమ్.. ఇంట్లోనే ఉరివేసుకుని తనువు చాలించాడు. ఉరికి వేలాడుతున్న కుమారుడిని చూసిన తల్లిదండ్రులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు  చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Suicide
Husband
Crime News
  • Loading...

More Telugu News