bike accident: బైక్ పై వెళ్తూ ఫేస్ బుక్ లైవ్ పెట్టాడు.. కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు

Bengal youth Falls Off Motorcycle While Live On Facebook Died

  • సరదా కోసం చేసి బలైపోయిన యువకుడు
  • తలకు గట్టి దెబ్బతగలడంతో మృతి
  • పశ్చిమ బెంగాల్ లోని అందాల్ లో ఘటన

సరదాగా బైక్ పై వెళ్తూ జేబులోంచి స్మార్ట్ ఫోన్ తీశాడు. బండి నడుపుతూనే ఫేస్ బుక్ లైవ్ వీడియో ఆన్ చేశాడు. కానీ బైక్ స్కిడ్ అయి కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పశ్చిమబెంగాల్ లోని అందాల్ పట్టణానికి చెందిన చంచల్ ధిబోర్ అనే 24 ఏళ్ల యువకుడు శనివారం సాయంత్రం సమీపంలోని కాళీ మాత గుడికి వెళ్లాడు.

గుడి నుంచి తిరిగి వస్తుండగా.. బైక్ నడుపుతూనే ఫోన్ తీసి, ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేశాడు. కానీ బండి కంట్రోల్ తప్పి కింద పడ్డాడు. దాంతో తలకు గట్టిగా దెబ్బ తగిలింది. చుట్టుపక్కల ఉన్న వాళ్లు అతడిని వెంటనే ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించాడు.

చంచల్ బండి నడపడం, కింద పడిపోవడం, అది చూసినవారు వచ్చి హెల్ప్ చేయడం అంతా ఫేస్ బుక్ లైవ్ లో కనిపించిందని చంచల్ స్నేహితులు తెలిపారు. అతను చనిపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు.

bike accident
Facebook
Facebook live
West Bengal
Road Accident
  • Loading...

More Telugu News