Crime News: ఇంటికి లేటుగా వచ్చిందని అమ్మాయిని కొట్టి చంపాడు!

Teen killed by father for coming home late

  • తలపై రాయితో కొట్టిన తండ్రి
  • ఆమెను అనుమానించే చంపేశాడన్న పోలీసులు
  • ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ లో ఘటన

తన కుమార్తె రాత్రి ఇంటికి లేటుగా వచ్చిందని చంపేశాడు. రాయితో తలపై ఇష్టమొచ్చినట్టుగా కొట్టాడు. ఆమె చనిపోయిన తర్వాత రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోయాడు. ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ లో ఈ దారుణమైన ఘటన జరిగింది. పోలీసులు, బాధితురాలి స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం..

ఇంటికి రాగానే గొడవ పెట్టి..

మహా సముంద్ కు చెందిన 42 ఏళ్ల సంతోష్ దివాన్ కు 19 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె ఇటీవల ఓ రోజు రాత్రి ఇంటికి లేటుగా వచ్చింది. ఇంతసేపూ ఎక్కడున్నావని తండ్రి ఆమెను నిలదీశాడు. ఆమె చెప్పింది వినకుండా గొడవపెట్టాడు. దీంతో ఆగ్రహంగా ఆమె బయటికి వెళ్లిపోయింది. తర్వాత ఆమె వెంటే వెళ్లిన సంతోష్.. రోడ్డు పక్కనే రాయితో బలంగా కొట్టి వెళ్లిపోయాడు. ఆ దెబ్బలతో ఆమె అక్కడే చనిపోయింది.

పోలీసులు గట్టిగా దర్యాప్తు చేయడంతో..

మరునాడు ఉదయం రోడ్డు పక్కన యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఇంటి ఇరుగుపొరుగు వారిని, స్నేహితులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. సంతోష్ కుమార్తెను ఎప్పుడూ అనుమానించేవాడని, సెల్ ఫోన్ కూడా వాడనిచ్చే వాడు కాదని, ఆమె బయటికి వెళ్లినప్పుడల్లా విపరీతంగా తిట్టేవాడని వారు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు సంతోష్ ను గట్టిగా ప్రశ్నించడంతో తానే చంపానని నిజం ఒప్పుకున్నాడు.

Crime News
Crime
father killed daughter
teen killed
Chhattisgarh
  • Loading...

More Telugu News