Khatija: తస్లీమా నస్రీన్ కు చురకలంటించిన ఏఆర్ రెహమాన్ కుమార్తె

AR Rahman daughter Khatija retorts Taslima Nasreem

  • బురఖాలో రెహమాన్ కుమార్తె ఖతీజా
  • ఆశ్చర్యం వ్యక్తం చేసిన తస్లీమా
  • ఊపిరాడట్లేదంటూ వ్యాఖ్యలు
  • బయటికి వెళ్లి గాలి పీల్చుకోవాలని కౌంటర్ ఇచ్చిన ఖతీజా

ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా గురించి ఇటీవల ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖతీజా బురఖా ధరించి ఉండడం పట్ల తస్లీమా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను రెహమాన్ సంగీతానికి అభిమానినని, కానీ ఆయన కుమార్తెను చూసిన ప్రతిసారి ఊపిరాడనట్టు ఫీలవుతుంటానని తెలిపారు. సంప్రదాయక కుటుంబాల్లో ఉండే చదువుకున్న మహిళలు కూడా ఈజీగా బ్రెయిన్ వాష్ కు గురికావడం బాధ కలిగిస్తుంటుందని వ్యాఖ్యానించారు. తస్లీమా వ్యాఖ్యలకు ఖతీజా దీటుగా బదులిచ్చింది.

తన మౌనాన్ని అజ్ఞానంగా భావించవద్దని, బలహీనత అనుకోవద్దని హితవు పలికింది. అంతేకాదు, తనను ఇలా బురఖాలో చూసి ఊపిరాడడంలేదని భావిస్తున్న వాళ్లు, కాస్త అలా బయటికెళ్లి తాజా గాలి పీల్చుకోవాలని చురకలంటించింది. స్త్రీవాదం అంటూ ఇతర మహిళలను బాధించేలా వ్యవహరించడం కాదని వ్యాఖ్యానించింది. తాను చేసే పనిపట్ల గర్విస్తున్నానని, అంతే తప్ప ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోనని స్పష్టం చేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News