Chiranjeevi: పెళ్లిపీటల మీద కూర్చునేసరికి నా చొక్కా చిరిగిపోయింది... అలాగే కట్టేశా: చిరంజీవి

Megastar Chiranjeevi reveals his wedding moments

  • భార్య సురేఖతో కలిసి చిరంజీవి ఇంటర్వ్యూ
  • పెళ్లినాటి ముచ్చట్లు వివరించిన మెగాస్టార్
  • బలవంతంగా పెళ్లి చూపులకు తీసుకెళ్లారని వెల్లడి

మెగాస్టార్ గా అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈసారి ఇంటర్వ్యూకు తన అర్ధాంగి సురేఖతో కలిసి విచ్చేసిన చిరు తన పెళ్లినాటి ముచ్చట్లు పంచుకున్నారు. తన కెరీర్ ఊపందుకుంటున్న తరుణంలోనే సురేఖతో తన వివాహం జరిగిందని చెప్పారు.

"సినీ పరిశ్రమ అంటే ఓ రంగుల ప్రపంచం అని మావాళ్లు భావించారు. ఇతర ఆకర్షణలకు లోనై పక్కదారి పడతానని భయపడ్డారు. అందుకే వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా అల్లు రామలింగయ్య గారి అమ్మాయి సురేఖతో పెళ్లి కుదిరింది. అప్పటికి నేను తాతయ్య ప్రేమ లీలలు అనే చిత్రంలో నటిస్తున్నాను. ఆ సినిమాలో నాకూ, నూతన్ ప్రసాద్ కు కొన్ని సీన్లు ఉండడంతో ఆయన కోసం పెళ్లి వాయిదా వేసుకోక తప్పదేమో అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే నూతన్ ప్రసాద్ ఎంతో బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ దొరకడం చాలా కష్టం. కానీ, మా నిర్మాత నా పెళ్లి కోసం ఏకంగా షూటింగునే నిలిపివేశారు.

కానీ పెళ్లిపీటలు ఎక్కేసరికి నా చొక్కా చిరిగిపోయింది. ఆ చిరిగిపోయిన చొక్కా చూసి సురేఖ మరో చొక్కా వేసుకోవచ్చుగా అంది. చొక్కా చిరిగినంత మాత్రాన తాళి కట్టలేనా అంటూ మూడు ముళ్లు వేసేశాను. అసలీ పెళ్లికి ముందు ఎంతో హడావుడి జరిగింది. మా వాళ్లు నన్ను ఎంతో బలవంతం మీద పెళ్లిచూపులకు తీసుకెళ్లారు. పెళ్లి కుదిరిన తర్వాత సురేఖతో నేను పెద్దగా మాట్లాడిందిలేదు. అప్పటికే నా గురించి ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య గారు ఎంతోమందిని ఎంక్వైరీ చేశారు" అంటూ వెల్లడించారు.

Chiranjeevi
Surekha
Wedding
Megastar
Allu Ramalimgaiah
Tollywood
  • Loading...

More Telugu News