Pawan Kalyan: ఓడినవాళ్లు ఓపెన్ గా ఏడిస్తే, గెలిచినవాళ్లు ఇంటికెళ్లి ఏడ్చారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan meets Tadepalligudem Janasainiks

  • నియోజకవర్గాల వారీగా పవన్ సమావేశాలు
  • తాడేపల్లిగూడెం కార్యకర్తలతో భేటీలో ఆసక్తికర వ్యాఖ్యలు
  • గత ఎన్నికల్లో ధన ప్రభావం బాగా ఉందన్న పవన్

జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఇవాళ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం పరిధిలోని జనసైనికులతో భేటీ అయిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా కనిపించిందని తెలిపారు. ఆ ఎన్నికల్లో ఓడినవాళ్లు ఓపెన్ గా ఏడిస్తే, గెలిచినవాళ్లు ఇంటికెళ్లి ఏడ్చారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా టీడీపీకి ఓటమి తప్పలేదని అన్నారు. అయితే అన్ని చోట్లా ప్రజలను డబ్బుతో కొనలేరన్నదానికి ఇటీవల ఢిల్లీలో ఆప్ విజయమే నిదర్శనమని పవన్ పేర్కొన్నారు.

ఆప్ ప్రజల కోసం పనిచేసింది కాబట్టే ప్రజలు ఓటేసి గెలిపించారని అభిప్రాయపడ్డారు. తాను కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ధనరహిత రాజకీయాలే చేస్తానని స్పష్టం చేశారు. ఓటేయడానికి డబ్బు తీసుకున్న ప్రజలు ప్రశ్నించే హక్కు కోల్పోతారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను సినిమాల్లో నటించడానికి కారణం డబ్బేనని, పార్టీ నడపడానికి డబ్బు అవసరం ఉండడంతో సినిమాలు చేయాల్సి వస్తోందని వెల్లడించారు. ఎవరికో మేళ్లు చేసి వారిచ్చిన డబ్బుతో రాజకీయాలు చేసే వ్యక్తిని కానని అన్నారు.

Pawan Kalyan
Janasena
Tadepalligudem
Delhi
AAP
  • Loading...

More Telugu News