Kukatpally: అమరావతి రైతులకు మద్దతుగా కూకట్ పల్లిలో సమావేశం.. అడ్డుకున్న పోలీసులు!

  • ఈ సమావేశానికి హాజరైన ఏపీ వాసులు
  • తమ అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు
  • పోలీసుల అదుపులో నిర్వాహకులు, మద్దతుదారులు 

అమరావతి రాజధానిని తరలించవద్దంటూ రైతులకు మద్దతుగా హైదరాబాద్ లోని ఏపీ వాసులు నిలిచారు. స్థానిక కూకట్ పల్లిలో ఈ సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సమావేశాన్ని పోలీసులు అడ్డుకుని, నిర్వాహకులను, మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమావేశానికి తమ అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, కూకట్ పల్లి, వసంత్ నగర్ సహా పరిసర కాలనీల్లోని ఏపీ వాసులు ఈ సమావేశానికి మద్దతు తెలిపారు. ‘ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని’, ‘కులం వద్దు..మతం వద్దు’, ‘రాజకీయాలు వద్దు.. రాజధాని ముద్దు’ అని రాసి ఉన్న ప్లకార్డులను చేతబూనారు. అమరావతిని తరలించవద్దని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Kukatpally
Ap people
support
Amaravati
Agitation
  • Loading...

More Telugu News