Karimnagar District: కాలుజారి కృష్ణా నదిలో పడ్డ అమ్మాయి.. ఆమెను రక్షించడానికి నీటిలో దిగి ఇద్దరు యువకుల మృతి

two youngsters died in krishna river

  • నారాయణపేట జిల్లా కృష్ణా మండలం వాసునగర్‌లో ఘటన
  • పెళ్లి వేడుకకు వచ్చి నదిలో దిగిన వైనం
  • ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం

కాలుజారి ఓ అమ్మాయి నదిలో పడిపోయింది.. ఆమెను రక్షించడానికి నీటిలో దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు.. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం వాసునగర్‌ సమీపంలో కృష్ణానదిలో చోటు చేసుకుంది.

రామకృష్ణరాజు, శ్రీహరి రాజు అనే యువకులు వారి బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కృష్ణానదిలో స్నానానికి మరికొందరితో కలిసి వెళ్లారు. ఇంతలో ఓ అమ్మాయి కాలుజారి నదిలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు నదిలోకి దిగారు.

వారు కూడా నీటిలో మునిగిపోతుండడంతో అక్కడ ఉన్న జాలరులు చూసి ముగ్గురు అమ్మాయిలను రక్షించారు. ఇద్దరు యువకులు మాత్రం నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గత ఈతగాళ్లను పిలిపించి, నదిలో గాలించారు. ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

Karimnagar District
  • Loading...

More Telugu News