Yanamala: సాక్షి మీడియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: యనమల

dont forgive sakshi media says yanamala

  • రూ.2 వేల కోట్లని దుష్ప్రచారం చేశారు
  • రూ.2 లక్షలను రూ.2 వేల కోట్లని ప్రచారం చేస్తారా?
  • 26 డొల్ల కంపెనీలని పీఎస్‌పై దుష్ఫ్రచారం చేస్తారా?
  • పంచనామా నివేదికపై వైసీపీ నేతలు ఇప్పుడేం జవాబిస్తారు?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల జరిగిన ఐటీ దాడులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు సహా పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో రూ. 2,000 కోట్లకు పైగా లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన వార్తలపై యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షి మీడియాతో పాటు   వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 వేల కోట్లని దుష్ప్రచారం చేశారని విమర్శించారు.

రూ.2 లక్షలను రూ.2 వేల కోట్లని ప్రచారం చేస్తారా? అని యనమల ప్రశ్నించారు. 26 డొల్ల కంపెనీలని పీఎస్‌పై దుష్ఫ్రచారం చేస్తారా? అని నిలదీశారు. పంచనామా నివేదికపై వైసీపీ నేతలు ఇప్పుడేం జవాబిస్తారు? అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేసినందుకే టీడీపీకి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Yanamala
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News