Nagaraju: కేటీఆర్ పీఏ నంటూ డబ్బు వసూలు... మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్!

Ex Ranji Cricketer Nagaraju Arrest

  • గతంలోనూ ఓ మారు అరెస్ట్
  • బెయిల్ పై వచ్చినా బుద్ధి మార్చుకోని నాగరాజు
  • మోసపోయిన నిర్మాణ సంస్థ
  • తాజాగా విశాఖపట్నంలో అరెస్ట్

తెలంగాణ మంత్రి కేటీఆర్ పేరు చెప్పి, ఓ రియల్ ఎస్టేట్ సంస్థను మోసం చేసిన కేసులో ఆంధ్రా రంజీ మాజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును విశాఖపట్నంలో పోలీసులు అరెస్ట్ చేశారు. తాను కేటీఆర్ పీఏనని సదరు సంస్థకు ఫోన్ చేసిన నాగరాజు, పేద క్రికెటర్లకు సాయం చేయాలంటూ, రూ. 3 లక్షలు తీసుకున్నాడు.

అంతకుముందు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరు చెప్పి పలు క్రికెట్ అసోసియేషన్లను మోసం చేసి లక్షలు వసూలు చేశాడు. ఎమ్మెస్కే ప్రసాద్ ఫోన్ నంబర్ ను స్ఫూఫింగ్ చేసి, ఆయనలా మాట్లాడి మోసం చేస్తుండేవాడు. ఆపై కొంతకాలానికి బ్యాంకును ఇలానే మోసం చేశాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన నాగరాజు, బెయిల్ పై బయటకు వచ్చి, మళ్లీ మోసాలకు తెరలేపాడు. కేటీఆర్ పర్సనల్ అసిస్టెంట్ నని చెబుతూ మోసం చేయడంతో, మరోసారి జైలుకు తరలించారు.

Nagaraju
Ex Ranji Player
Cricketer
KTR
  • Loading...

More Telugu News